సీతారాంపురంలో పీర్లపండుగ


ఎక్మారే ...... రడబుషణ ..........అసేయ్  దులా............ దులా...........
మొహరం శుభాకాంక్షలు......


 పీర్లపండుగ మా గ్రామంలో కుల ,మతాలకు అతీతంగా అందరు కలసి అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ పండుగను పది రోజులపాటు ఒకొక్క సవారీని(పిర్లు) ఊరేగిస్తూ,కొరడాలతో హాల్ చల్ చేసుకుంటూ గ్రామంలోని ప్రతి వాడకు తిప్పుతారు.

చిన్నపుడైతే పీర్లపండు గోచ్చిందంటే గ్రామా పంచాయతి ముందుండే పిరీల కొట్టం కడనే ఉంట్టుటిమి. పిరీల ముందు నిప్పుల గుండం(అల్వా) ఏర్పాటు చేసేవారు ఈ నిప్పుల గుండం చుట్టూ మేమంతా చేరి రౌండ్ గా తిరుగుతూ దొరికిచ్చుకునుడు ఆట అడేటోల్లం, మా పాదాలకు, మోకలకు అంత మసి అన్టేడిది. పిరిలా దగ్గరకు వెళ్ళగానే ఊదు వాసనా గుభాలించేది, శిగం వచ్చిన వారిని చూసి భయమేసేది, కొంతమంది వేషాలు వేసుకొని అల్వా చుట్టూ తిరుగుతూ పాటలు పడేవారు. ఒకొక్క సవారిలకు ఒకొక్క పెరును పెడుతారు. రోజు ఒక సవారీని సాంబ్రాణి పొగతో లేపి ఊరు మొత్తం తిప్పుతారు. నా చిన్నప్పుడు సవారీలను ఎత్తుకోవడానికి పోటిపడేటోల్లం ముఖ్యంగా రడబుషణ సవారీని ఎత్తుకోవడానికి బడికి కూడా డుమ్మాలు కోటేటోల్లం. ఇంటి ముందుకొచ్చిన ఈ పిర్లుకు గ్రామప్రజలకు బిందదు నీళ్ళను సవారీ ఎత్తుకున్న వారి పాదాలను తడుపుతారు ఆతరువాత ఒక కొబ్బరిచెక్క, 10నుండి 100 రూపాయలవరకు సవార్లకు కట్టి, ఊదు పొగ వేసి మొక్కుతారు, ముస్లిం దగ్గరుండే నెమలి ఈకల కట్ట, నెత్తి మిదపెట్టి ఆశిర్వదిస్తాడు.

పీర్లపండుగ చివరి రోజు తల్లి సవారీని లేపుతారు, ఈ తల్లి సవారీ క్రింది నుంచి పోతే పాపాలు పోతాయని పెద్దల నమ్మకం. ఈ రోజు ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్క మొద్దుతుంటనైన తెచ్చి అల్వాలో వేస్తారు, తద్వారా మనకు మంచి జరుగుతుందని నమ్మకం. ఈ రోజు సాయంత్రం గ్రామా ప్రజలంతా అల్వా చుట్టుచేరి సవరిలను ఎత్తుకొని భజనలు,కోలాటం,జానపద పాటలు, ఆటలతో వేడుకలను జరుపుకుంటారు. సవరిలదగ్గర మటికిలు( బెల్లం నీళ్ళు ) అందరికి ఇస్తారు. ఈ పండుగ కులమతాల ఐక్యతకు ప్రతీకగ నిలుస్తోంది.

మీ,
కడవెండి సీతారాంపురం.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.