మా ఊరి దసరా......

సీతారాంపురం గ్రామపంచాయతి  ముందు దసరసంబారాలు ...



దసరా వచ్చిందంటే మాకందరికీ పండగే.మా ఊరిలో దసరా బాగా జరుపుకుంటాము.  పండుగలన్నింటిలో  పెద్దపండుగ కాబట్టి చదువులరీత్యా గాని, ఉద్యోగరీత్యా  గాని హైదరాబాద్‌లో ఉన్నా ప్రతి ఒక్కరు ఈ  పండుగనాడు మాత్రం ఊళ్లోనే ఉంటాం . చిన్నప్పుడు దసరా పండుగ అంటే... కొత్త బట్టలు.. టపాసులు... పిండివంటలు. ఇప్పుడు దసరా అంటే.. బంధువులు, మిత్రులందరినీ కలవడమే.

         దసరా పండుగ చరిత్రను చూసినట్లయితే రాముడు రావణుని పై గెలిచినందుకు,పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజైనందుకు ,జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ఈ  పండగను  జరుపుకున్నాము. 
    

  ఇకపోతే  నేను  పండుగనాడు పొద్దున్నే లేచి స్థాన్నం  చేసి, మామిడాకులు, బంతిపూలతో దండలు గుచ్చి దర్వాజలకు కట్టి   ఆ తర్వాత కుటుంబ సభ్యులమందరం కలసి దేవుని గదిలో కొబ్బరికయని కొట్టి పూజ చేస్తాం.
ఈ రోజు మాంసాహారము వండి కుటుంబసమేతముగా కూర్చొని భోజనం చేస్తాము. ఆ తర్వాత నేను మా ఉరి బడి  దగ్గర  ఫ్రెండ్స్‌నందరిని కలిసి, ఒకరినొకరు పలకరించుకుంటం.  ఎవరెవరు  ఏం చేస్తున్నరు.. ఈ ఏడాదిలో జరిగిన ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటం. 
క్రికెట్ కూడా ఆడుతాం. తర్వాత అందరం సిట్టింగ్ వేస్తాం అదేనండి  బిరు,మందు, కల్లు ఏది తగేవాళ్ళు  అది తాగుతారు. ఇక  సాయంత్రం మొదలయ్యేదే అసలైన దసరా.అందరం కొత్త బట్టలేసుకుని.. గ్రామా  పంచాయతి ముందు  దసరా గద్దె  దగ్గర  గ్రామస్తులందరూ  కోలాహలం గా  చేరి మా  కేరింతలనడుమ  గ్రామా పెద్దల   సమక్షంలో దసరా గద్దె మీద పూజ చేసి, బంటాయన (పేరు గుర్తుకు లేదు ) ముందుగాల్ల ఆనిక్కాయ కొట్టి అటెంక ఒక్కటే దెబ్బకు  గొర్రె పిల్ల మెడ ను నరుకుతాడు. ఎగబడి మరీ యువత కత్తికి  అంటిన రక్తంన్ని  బొట్టుగాపెట్టుకుటారు. నరికిన రక్తపు  కత్తితో దుక్కిడి శివాజీ పొలంలోనున్న  జమ్మిచెట్టు దగ్గరికి   ర్యాలీగా బయలుదేరుతాం.. అక్కడా పూజలు చేసి... జమ్మి తెంపుకుని, అక్కడే కలిసిన మిత్రులందరికీ జమ్మి పెట్టి అలాయ్‌బలాయ్ తీసుకుంటం. పెద్దవాళ్లకు జమ్మి చేతిలో పెట్టి పాదాబివందనము చేసి  
 ఆశీర్వాదాలు అందుకుంటం. పాలపిట్టను చూసి, ఇంటికొచ్చి అమ్మానాన్న,అక్క ల చేతిలో జమ్మిపెట్టి ఆశీర్వాదం తీసుకుంటం. తరువాత చుట్టుపక్కల అందరినీ కలిసి జమ్మి ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితి. మళ్ళీ ఒకసారి  నైట్ జేబులన్ని ఖాళీ అయినా పర్లేదు గాని సంబరం అంబరమంటాలెగా  పార్టీ చేసి  దసరా ముగిస్తాము.

ఇది మా ఊరి దసరా............... 










No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.