మా ఊరి బతుకమ్మ........

  •                 మన తెలంగాణా లో మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ
    ఈ బతుకమ్మ పండుగను గౌరి లేదా సద్దుల పండుగ అనికూడా అంటారు.

    మన కడవెండి సీతారాంపురం లో ఈ బతుకమ్మ పండుగ సంబరాలు
    అంబరమంటేలగా జరుపుకోవడం ఆనవాయీతిగా కొనసాగుతుంది.
    పండుకోచ్చిదంటేచాలు ఎంతో సంతోషంతో మా ఊరి కి చేరుకుంటాము. పండక్కి మా అక్క, వాళ్ళ పిల్లలతో మా ఇల్లు సందడితో కళకళలాడుతూ ఉంటుంది.
    (అడపడుచులందరూ అత్తవారింటి నుండి కన్నావారింటికి చేరుకుంటారన్నమాట )
    పండుగ ముందురోజు నేను మరియు మా స్నేహింతులు కలిసి పువ్వులకై మా భావికాడినుండి రోడ్డు అవతలున్న కంచలొ తంగేడి,గునుగు,గడ్డి చామంతి,నూకల పువ్వులు ఇలా అనేక రకముల పువ్వులు తో సహా సితాఫలములు(సిల్పక్కాయలు) కూడా తెచ్చేవాల్లము.
    గత కొన్ని సంవత్సరాలనుండి కంచెలను నరికివేయడం మరియు పత్తి పంటల వల్ల తంగేడి,గునుగు పువ్వులు కనిపిచకుండా పొనై వీటికి బదులు టేకు పువ్వులు మరియు రోడ్డులపై ఉన్న గవర్నమెంట్ చెట్ల పులు తెస్తున్నాము. ఈ పువ్వులను అడపడుచులకివ్వగా ,పళ్ళెం లేకపోతే తాంబలం లో జాగ్రత్తగా చుట్టూ వలయాకారంలో మొదటగా తంగేడి పులు పేర్చి,ఆ తర్వాత గునుగుపులు వివిధ రంగులలో ముంచి వాటిని పేర్చుతారు. మధ్యమధ్యలో వివిధ రకముల పువ్వులనూపయొగించి ఆ పై పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి కొవ్వత్తితో దీపాన్ని వెలిగిస్తారు. ఈ పెర్చిన బతుకమ్మను దేవుని గదిలో ఉన్న దేవుళ్ళ ముందు పెట్టి పుజిస్తారు.

    సాయంత్రసమయన గ్రామా మహిళలందరూ డప్పుగాళ్ళ సందడి నడుమ మొదటగా గ్రామా బొడ్రాయి వద్దకి చేరుకొని, ఇక్కడినుండి జనసముహముగా గ్రామా చెఱువు గట్టు వద్ద నున్న శివాజీ బొమ్మ వద్దకు చేరుకొని, వారివారి కులములదారముగా గుపులు గుంపులుగా చేరి తులసి లేదా యంపటి చెట్టు ను మద్యలో పెట్టి దీనిచుట్టు బతుకమ్మలను దించి పురోహితుని మంత్రాలతో బతుకమ్మలకు పూజలుచేసి, ఆతర్వాత బతుకమ్మ ల చుట్టూ గౌరీ మాతను కీర్తిస్తూ చప్పట్లతో పాటలను పాడుకుంటూ వారి భక్తిని చాటుకుంటారు. ఈ సందర్బంలో ఆడపడుచులు వారి యోగక్షేమాలు ,అత్తారింటి ముచ్చట్లు, చీరలు, ఆభరణాలు ఇలా ముచ్చట్లు పెట్టుకోవడం చూస్తుంటే ఆదో వింత అనుభూతి. ఇలా సుమారుగా రెండు గంటల తర్వాత ఈ బతుకమ్మ లను తీసి పక్కనే వున్న గ్రామ చెఱువులో నిమర్జనం చేస్తారు.
    అటుపై పళ్ళెం లో వీరు తెచ్చిన పసుపుకుంకుమలను వారివారి పుస్తెలకు బొట్టుగా పెట్టుకొని వాయినాలు ఇచ్చుకుంటారు తర్వాత బెల్లం ,చెక్కర, వేరుశనగలు, నువ్వులు,మొక్కజొన్నలు,భియ్యం మొదలైన వాటితో చేసిన ప్రదార్ధాలను ప్రసాదంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక దీనితో బతుకమ్మ పండుగ
    ముగిస్తుంది. ఇది మా ఊరి బతుకమ్మ......

                          
                                       



No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.